Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

6 గ్యారంటీలు.. 420 హామీలు.. అమలులో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్‌ఎస్ ఆరోపణ

Author TELANGANA ADDA NEWS | 07 Sep 2026, 08:05 PM |
6 గ్యారంటీలు.. 420 హామీలు.. అమలులో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్‌ఎస్ ఆరోపణ

జిన్నారంలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ

6 గ్యారంటీలు.. 420 హామీలు.. అమలులో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్‌ఎస్ ఆరోపణ

జిన్నారం, తెలంగాణ అడ్డా:
తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ జిన్నారం మున్సిపల్ కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ‘కాంగ్రెస్ బాకీ కార్డుల’ను గడపగడపకు పంపిణీ చేశారు. బీఆర్‌ఎస్ జిన్నారం టౌన్ ప్రెసిడెంట్ గోపగో శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో ప్రజలను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు.

మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్, రైతు భరోసా, రైతు రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, కల్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం, మహిళలకు స్కూటీలు తదితర హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని, వాటిలో అనేక హామీలు ఇంకా పూర్తిస్థాయిలో అమలు కాలేదని బీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు.

ఈ హామీలను ప్రజలకు మరోసారి గుర్తు చేస్తూ ‘కాంగ్రెస్ బాకీ కార్డులు’ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించాలని బీఆర్‌ఎస్ నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు మంద రమేష్, శ్రీధర్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, తోట నర్సింగరావు, నీలం మోహన్, బ్రహ్మేందర్ గౌడ్, బిక్షపతి గౌడ్, గోపి గౌడ్, నిఖిల్, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.