Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి, అరెస్టులకు భయపడేది లేదు: బీజేపీ మండల అధ్యక్షుడు అడప రాజు

Author TELANGANA ADDA NEWS | 07 Sep 2026, 09:08 PM |
కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి, అరెస్టులకు భయపడేది లేదు: బీజేపీ మండల అధ్యక్షుడు అడప రాజు

అక్రమ అరెస్టులతో బీజేపీ గొంతు నొక్కలేరు

కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి, అరెస్టులకు భయపడేది లేదు: బీజేపీ మండల అధ్యక్షుడు అడప రాజు

వర్ధన్నపేట ప్రతినిధి, సెప్టెంబర్ 7:
అక్రమ అరెస్టులతో బీజేపీ గొంతును నొక్కలేరని వర్ధన్నపేట బీజేపీ మండల అధ్యక్షుడు అడప రాజు అన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం నేపథ్యంలో అడప రాజును పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

చలో అసెంబ్లీ కార్యక్రమానికి బీజేపీ శ్రేణులు తరలివెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అడప రాజుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా అడప రాజు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాయకులను ముందస్తుగా అరెస్టు చేసినప్పటికీ విద్యార్థుల సమస్యలపై బీజేపీ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పూర్తిగా విడుదల చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

ప్రభుత్వం అరెస్టులు, నిర్బంధాలతో తమ ఉద్యమాన్ని అడ్డుకోలేదని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అడప రాజు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొండేటి సత్యం, రాయపురపు కుమారస్వామి, మల్లెపాక అనిల్, గిరిబాబు, తేజ నాయక్, దేవేందర్, సుంకరి బాబు, ఎల్ల స్వామి, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.