Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గణేష్ నవశరాత్రి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి

Author TELANGANA ADDA NEWS | 09 Sep 2026, 08:05 PM |
గణేష్ నవశరాత్రి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి

గణేష్ నవశరాత్రి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి
నల్గొండ బ్యూరో / తెలంగాణ అడ్డా:
వచ్చే గణేష్ నవశరాత్రి వేడుకలను ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేసేందుకు ప్రజలు, శాంతి కమిటీ సభ్యులు, గణేష్ ఉత్సవ నిర్వాహకులు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి కోరారు. శాంతి కమిటీ సభ్యులు మరియు గణేష్ ఉత్సవ నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నిర్వహణ, గణేష్ మండపాల వద్ద తీసుకోవాల్సిన భద్రతా చర్యల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
ప్రతి గణేష్ మండలాన్ని విధిగా ఆన్‌లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు, అగ్నిప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రాత్రి సమయాల్లోనూ మండపాల వద్ద తగిన భద్రత ఉండేలా చూసుకోవాలని నిర్వాహకులను డీఎస్పీ ఆదేశించారు. మద్యం తాగి వేడుకల్లో పాల్గొనడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, రెచ్చగొట్టే నినాదాలు చేయడం, సౌండ్ సిస్టమ్స్ లేదా డీజే నిబంధనలను ఉల్లంఘించడం, ఇతరులకు అసౌకర్యం కలిగించే కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే వదంతులు, ఫేక్ న్యూస్, రెచ్చగొట్టే పోస్టులు, అభ్యంతరకర వీడియోలు, ఇతరుల మనోభావాలను దెబ్బతీసే కంటెంట్ ప్రచారం కాకుండా సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు తెలిపారు.
నిమజ్జన ఊరేగింపు సందర్భంగా మళ్లింపులు, బారికేడింగ్, పార్కింగ్ సదుపాయాలతో కూడిన ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు, వాహనదారులు పోలీసుల సూచనలను పాటించి అధికారులకు సహకరించాలని కోరారు. భక్తిశ్రద్ధలు, ప్రశాంతత, సౌభ్రాతృత్వంతో గణేష్ నవశరాత్రి వేడుకలు జరుపుకోవాలని, అందరి సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా వేడుకలను ప్రశాంతంగా ముగిద్దామని డీఎస్పీ కె. శివరాం రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఆర్డీవో అశోక్, ఎస్బీ డీఎస్పీ మల్లారెడ్డి, శాంతి కమిటీ సభ్యులు, గణేష్ ఉత్సవ నిర్వాహకులు, పోలీస్ అధికారులు మరియు వివిధ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు.