Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించాలి 55 ఏళ్లు నిండిన కార్మికులకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలి: ఏఐటీయూసీ

Author TELANGANA ADDA NEWS | 11 Sep 2026, 05:53 PM |
కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించాలి  55 ఏళ్లు నిండిన కార్మికులకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలి: ఏఐటీయూసీ

కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించాలి

55 ఏళ్లు నిండిన కార్మికులకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలి: ఏఐటీయూసీ

బోయినపల్లి, సెప్టెంబర్ 11 (తెలంగాణ అడ్డా): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో సుతారి సంఘం సమావేశం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమ బోర్డుకు 2 శాతం నిధులు కేటాయించకపోగా, కార్మిక సంక్షేమ నిధిని సంవత్సరం టెండర్ పేరుతో కాంట్రాక్టుకు అప్పగించారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

టెండర్ ప్రక్రియ పూర్తయి మూడు నెలలు గడిచినా కార్మికుల పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 55 ఏళ్లు నిండిన కార్మికులకు నెలకు రూ.5 వేల పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికుల వివాహానికి రూ.లక్ష, ప్రసవానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కార్మిక సంఘం నాయకులు రాజన్న, మల్లేశం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.