Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రజక కాలనీలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌ లీకేజీకి మరమ్మతులు

Author TELANGANA ADDA NEWS | 13 Sep 2026, 02:18 PM |
రజక కాలనీలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌ లీకేజీకి మరమ్మతులు

పైప్‌లైన్ లీకేజీకి వెంటనే స్పందించిన సర్పంచ్

రజక కాలనీలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌ లీకేజీకి మరమ్మతులు

టేక్మాల్, సెప్టెంబర్ 13 (తెలంగాణ అడ్డా):
టేక్మాల్ గ్రామంలోని రజక కాలనీలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌ లీకేజీ కారణంగా నీరు బయటకు వచ్చి స్థానికులకు ఇబ్బందులు కలిగిన విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్‌ తిమ్మిగారి సుధాకర్‌ వెంటనే స్పందించారు. జేసీబీ సహాయంతో మరమ్మతు పనులను వేగవంతం చేయించారు.

ఇవి కూడా చదవండి

పైప్‌లైన్‌ లీకేజీ కారణంగా ప్రభుత్వం నిర్మించిన రజక కమ్యూనిటీ హాల్‌ కింది భాగం నుంచి నీరు బయటకు రావడంతో పాటు, సమీపంలోని ఇళ్లలోకి కూడా నీరు చేరినట్లు స్థానికులు తెలిపారు. విషయం సర్పంచ్‌ దృష్టికి తీసుకెళ్లగానే ఆయన వెంటనే పంచాయతీ సిబ్బందిని అక్కడికి పంపించి లీకేజీని అరికట్టే చర్యలు చేపట్టారు.

గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సర్పంచ్‌ సిబ్బందిని ఆదేశించారు. గ్రామ కార్యదర్శి కూడా చొరవ తీసుకుని మరమ్మతు పనులను పర్యవేక్షించారు.

లీకేజీని అరికట్టేందుకు వార్డు సభ్యులు యాదగిరి, భాగ్యలక్ష్మి, ఎర్రోళ్ల రమేష్‌, సాయమ్మోళ్ల అనిల్‌, గ్రామ పంచాయతీ సిబ్బంది బోయిని తుకారాం తదితరులు సహకరించారు.

పైప్‌లైన్‌ లీకేజీపై వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిన సర్పంచ్‌ తిమ్మిగారి సుధాకర్‌కు రజక కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.