Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

యూపీఐ లావాదేవీలపై ఛార్జీల మోత రోజువారీ రూ. 50 కోట్లు, సంవత్సరానికి రూ. 4 లక్షల కోట్ల ఆదాయం! చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం రూ. 50,000 వరకు మినహాయింపు ఇవ్వాలని ప్రజల డిమాండ్

Author Mohammad azeem | 17 Sep 2026, 11:17 AM | TELANGANA, అంతర్జాతీయం
యూపీఐ లావాదేవీలపై ఛార్జీల మోత రోజువారీ రూ. 50 కోట్లు, సంవత్సరానికి రూ. 4 లక్షల కోట్ల ఆదాయం! చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం రూ. 50,000 వరకు మినహాయింపు ఇవ్వాలని ప్రజల డిమాండ్

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
దేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో యూపీఐ (UPI) సేవలు విప్లవాత్మక మార్పులు సృష్టించాయి. కోట్లాది మంది ప్రజలు రోజువారీ లావాదేవీల కోసం దీన్ని ఉపయోగిస్తున్నప్పటికీ, దీని వెనుక చిన్న వ్యాపారులు ఎదుర్కొంటున్న ఆర్థిక భారం మరియు ప్రభుత్వ ఆదాయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.తాజా గణాంకాల ప్రకారం, దేశంలో డిజిటల్ పేమెంట్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఆగస్టు నెలలో యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయిలో 24.51 బిలియన్లకు (దాదాపు 2,451 కోట్లు) చేరగా, వీటికి సంబంధించిన మొత్తం విలువ సుమారు రూ. 29.82 లక్షల కోట్లుగా (29,82,000 కోట్లు) నమోదైంది. అంటే దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 79 కోట్ల లావాదేవీలు జరుగుతుండగా, అందులో దాదాపు 50 కోట్ల లావాదేవీలు కేవలం చిన్న దుకాణాలు, కిరాణా షాపులు, వీధి వ్యాపారుల వద్దే క్యూఆర్ కోడ్ ద్వారా జరుగుతున్నాయి.
ఈ లావాదేవీల ద్వారా రోజువారీగా సుమారు రూ. 50 కోట్ల రూపాయల వరకు పన్ను రూపంలో వసూలు అవుతున్నట్లు అంచనా. దీనిని బట్టి చూస్తే, సంవత్సరానికి దాదాపు రూ. 4 లక్షల కోట్ల రూపాయల వరకు పన్ను మరియు ఛార్జీల భారం పడే అవకాశం ఉందని అంచనా వేయబడుతోంది. నిబంధనల ప్రకారం రూ. 2,000 వరకు జరిగే లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు (0%). కానీ, ఆ మొత్తాన్ని దాటితే వ్యాపారులపై 0.4% నుండి 0.5% వరకు మర్చెంట్ డిస్కౌంట్ రేట్ (MDR) రూపంలో ఛార్జీల భారం పడుతోంది.
మరోవైపు యూపీఐ వినియోగం వల్ల ప్రజలకు బ్యాంకులకు వెళ్లే శ్రమ తప్పడంతో పాటు ఎంతో సమయం ఆదా అవుతోంది. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగులు పెరగకపోవడం, జీతాలు పెరగకపోవడం, ప్రస్తుతం ఉన్న బ్యాంకులలో రద్దీ విపరీతంగా పెరగడం మరియు సరైన పార్కింగ్ వసతులు లేని ఇబ్బందుల నుంచి ప్రజలకు ఎంతో ఊరట లభించింది. ఆటోమేటిక్‌గా డిజిటల్ విధానం వల్ల ప్రభుత్వానికి కూడా పెద్దఎత్తున లాభాలు కలుగుతున్నాయి. బ్యాంకుల రద్దీకి ఇది చక్కటి అడ్డుకట్టగా నిలిచింది.అయితే, ఇలా ఆటోమేటిక్‌గా ప్రభుత్వానికి లాభం జరుగుతున్నప్పటికీ, మళ్ళీ దీని మీద ఛార్జీలు మరియు పన్నుల భారం మోపడం వల్ల సామాన్యులకు, ముఖ్యంగా చిన్న చిన్న మర్చంట్స్, చిరు వ్యాపారులకు తీవ్రమైన ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. పరిమిత లాభాలతో బతికే చిరు వ్యాపారులకు ఈ ఛార్జీలు మోయరాని భారంగా మారుతున్నాయి.ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలపై ఎలాంటి పన్ను భారం మోపకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఒకవేళ ఛార్జీలు లేదా పరిమితులు విధించాల్సి వస్తే, చిన్న వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా మినహాయింపు ఇవ్వాలి. రోజువారీ లావాదేవీల పరిమితిని లేదా పన్ను మినహాయింపును రూ. 50,000 నుంచి ప్రారంభించాలని ప్రజల నుంచి తీవ్రమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రూ. 50,000 వరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉంచితే చిరు వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుంది. పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపే బడా వ్యాపారులపై ఈ నిబంధనలు వర్తింపజేసినా పెద్దగా సమస్య ఉండదు కాబట్టి, చిన్న వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఈ అంశంపై పునరాలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.