Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పంట పొలాలకు డ్రైనేజీ మళ్లింపు.. రైతుల ఆవేదన

Author TELANGANA ADDA NEWS | 19 Sep 2026, 09:54 AM | TELANGANA
పంట పొలాలకు డ్రైనేజీ మళ్లింపు.. రైతుల ఆవేదన

పంట పొలాలకు డ్రైనేజీ మళ్లింపు.. రైతుల ఆవేదన

ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ మోరీలను పంట పొలాల వైపు మళ్లించారని ఆరోపణ

సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని రైతుల విజ్ఞప్తి

ఇవి కూడా చదవండి

బోయిన్పల్లి, సెప్టెంబర్ 18 (తెలంగాణ అడ్డా):
వరద వెళ్లి గ్రామ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ రాజన్నపేట డ్రైనేజీ నీటిని పంట పొలాల వైపు మళ్లించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సర్పంచ్‌ స్వయంగా డ్రైనేజీని పంట పొలాల వైపు మళ్లించారని కొంతమంది రైతులు ఆరోపిస్తున్నారు.

రైతుల వివరాల ప్రకారం.. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ చుట్టూ నిర్మించాల్సిన లింక్‌ మోరీ పనులు గతంలో పూర్తికాకపోవడంతో సమస్య కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం కాలనీ నుంచి వచ్చే డ్రైనేజీ నీటిని పంట పొలాల వైపు మళ్లించడంతో వర్షాలు కురిసిన సమయంలో పొలాల్లోకి నీరు చేరి పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు.

కాలనీ చుట్టూ పూర్తిస్థాయి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి, నీరు పంట పొలాల్లోకి వెళ్లకుండా శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. తమ పంటలకు నష్టం వాటిల్లకుండా సంబంధిత అధికారులు తక్షణమే పరిశీలించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

గ్రామ సర్పంచ్‌ డ్రైనేజీ మళ్లింపుపై వచ్చిన ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను నిర్ధారించాలని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత వారిపై తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.