Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఘనంగా సత్కరించిన 'అల్ఫోర్స్' డా. వి. నరేందర్ రెడ్డి

Author | 07 Oct 2026, 12:16 PM | Technology
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఘనంగా సత్కరించిన 'అల్ఫోర్స్' డా. వి. నరేందర్ రెడ్డి

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ
సమాజ సేవలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ పాత్ర అత్యంత ప్రశంసనీయమని, ఈ సంస్థ అందిస్తున్న సేవలతో సమాజంలో ఎంతో మంది లబ్ధి పొందుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, 'అల్ఫోర్స్' విద్యా సంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి కొనియాడారు.
స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ విద్యా సంస్థల కేంద్ర కార్యాలయంలో కరీంనగర్ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గ సభ్యులకు ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యవర్గ సభ్యులను డా. నరేందర్ రెడ్డి శాలువాలతో ఘనంగా సత్కరించి, హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సత్కారం అందుకున్న నూతన రెడ్‌క్రాస్ సొసైటీ ప్రముఖులు:
అధ్యక్షులు: సంఘం లక్ష్మణరావు
ఉపాధ్యక్షులు: ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి
కోశాధికారి: జి. శ్రీనివాస్
కార్యవర్గ సభ్యులు: కే. మహేశ్వర్, ఎ. మునిందర్, సిహెచ్. సురేష్, కే. అన్నారెడ్డి, కే. మనోహర్ రావు, ఆర్. శ్రీనివాస్, ఎం. రాకేష్, పి. విద్యాసాగర్, హనుమండ్ల రాజిరెడ్డి.
ఈ సందర్భంగా డా. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ... నూతన కార్యవర్గం భవిష్యత్తులో చేపట్టే అన్ని సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో మరింత మందికి వైద్య, ఆరోగ్య మరియు రక్తదాన సేవలు విస్తరించాలని ఆకాంక్షించారు.