Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కీసర మాజీ సీఐ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ. 2.28 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు!

Author | 17 Oct 2026, 07:35 PM | TELANGANA
కీసర మాజీ సీఐ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ. 2.28 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు!

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

​ఏకకాలంలో బంధువులు, బినామీల ఇళ్లలో తనిఖీలు నిర్వహించిన అధికారులు

​లంచం కేసులో ఇప్పటికే చంచల్‌గూడ జైలులో ఉన్న ఆంజనేయులుపై పీటీ వారెంట్‌తో విచారణ

ఇవి కూడా చదవండి

మేడ్చల్-మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ మాజీ ఇన్‌స్పెక్టర్ అర్కపల్లి ఆంజనేయులుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. శనివారం ఏసీబీ అధికారులు ఆయన ఇల్లు, కార్యాలయంతో పాటు బంధువులు, బినామీల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
​ఈ సోదాల్లో లభించిన ఆస్తుల వివరాలు:
​సరూర్ నగర్, ఎల్బీనగర్, పేరూరులలో ఇళ్లు మరియు ప్లాట్లు గుర్తింపు.
​మిర్యాలగూడ హాలియాలో 2 ఎకరాల వ్యవసాయ భూమి స్వాధీనం.
​రూ. 7 లక్షల నగదు, 60 తులాల బంగారం, విటారా బ్రెజ్జా కారు లభ్యం.
​మొత్తం ఆస్తుల ప్రభుత్వ విలువే సుమారు రూ. 2,28,50,000/- కాగా, బహిరంగ మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉంటుందని ఏసీబీ పేర్కొంది.
​గత నెలలో లంచం తీసుకుంటూ పట్టుబడి ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ఆంజనేయులుపై ఏసీబీ అధికారులు పీటీ వారెంట్‌పై విచారణ చేపట్టనున్నారు.
ఎవరైనా లంచం అడిగితే సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెంబర్: 1064