మ‌నం ఇంత ఖాళీగా ఉన్నామా..!

30th May, 2025 11:37 AM

కోహ్లీ లైక్ కొట్ట‌డంపై ర‌కుల్ కామెంట్..

Rakul Preet Singh | కింగ్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. అత‌ను ఇప్ప‌టికీ కుర్రాళ్ల‌కి పోటీగా క్రికెట్ ఆడుతున్నాడు. ఆయ‌న క‌నిపిస్తే అభిమానులు పూన‌కాలు వ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు. ఇక సోష‌ల్ మీడియాలో విరాట్ కోహ్లీని ఫాలో అయ్యే వారు చాలా ఎక్కువే. అయితే కోహ్లీ ఇటీవ‌ల ఓ హాట్ బ్యూటీ ఫొటోకి లైక్ కొట్టాడు. దాంతో ఒక్కసారిగా అతని ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లంతా షాక్ అయ్యారు. విరాట్ కోహ్లి ఏంటీ ఈ బ్యూటీ ఫొటోకి లైక్ కొట్టడం ఏంటని అంతా అవాక్కయ్యారు. ఇలా ఎలా జ‌రిగింది అని తెలుసుకునేలోపే ఈ విష‌యం సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది.

బాలీవుడ్ బ్యూటీ అవనీత్ కౌర్ ఇటీవల తన గోవా ఫొటోషూట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ కింద విరాట్ కోహ్లి లైక్ కనిపించింది. అయితే బోల్డ్ ఫొటోస్‌తో రచ్చ చేసే ఈ బ్యూటీ ఫొటోకి కోహ్లీ లైక్ కొట్ట‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.ఇది పెద్ద ఇష్యూగా మారుతుండటంతో నేరుగా కోహ్లినే స్పందించాల్సి వచ్చింది. నా ఫీడ్ క్లియర్ చేసేటప్పుడు బహుశా అల్గారిథం పొరపాటు వల్ల ఇలా జరిగి ఉండొచ్చు. దీని వెనుక ఎలాంటి ఉద్దేశం లేదు. అనవసర ఊహాగానాలు చేయొద్దంటూ రిక్వెస్ట్ చేశారు. అర్ధం చేసుకున్నందుకు థ్యాంక్స్ అని కూడా కోహ్లీ త‌న కామెంట్‌లో తెలియ‌జేశాడు. అయితే ఈ ఇష్యూ గురించి తాజాగా ర‌కుల్ ప్రీత్ సింగ్ స్పందించింది.

నటి అవ్‌నీత్ కౌర్ ఫ్యాన్ పేజీలోని ఓ పోస్ట్‌ను విరాట్ కోహ్లీ లైక్ చేయడంతో ఆమెకి ఏకంగా 2 మిలియన్ల మంది ఫాలోవర్లు పెరిగారట. ఇది చాలా బాధ కలిగించే విషయం. మనమంతా ఇంత ఖాళీగా ఉన్నామా అనిపిస్తోంది అంటూ ర‌కుల్ కాస్త చుర‌కలు అంటించింది. అస‌లు ఆ లైక్ విరాట్ కోహ్లీ కావాల‌ని చేశాడా, లేదంటే అనుకోకుండా జ‌రిగిందా అని ఎవ‌రు ఆలోచించ‌డం లేదు. ఒక్కోసారి మనం ఇన్‌స్టాగ్రామ్‌లో మన స్నేహితులనే పొరపాటున అన్‌ఫాలో చేస్తుంటాం. కోహ్లీ సెలబ్రిటీ కాబట్టి ఆయనకు సంబంధించిన చిన్న విషయాలను కూడా అంత‌లా వైరల్ చేస్తున్నారు. సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా ప్రజలు మ‌రింత లోతుగా విశ్లేషిస్తూ సోషల్ మీడియాలో సమయాన్ని వృథా చేస్తున్నారని రకుల్ అభిప్రాయపడ్డారు. నా దృష్టిలో ఇది పూర్తిగా అనవసరం అంటూ ర‌కుల్ పేర్కొంది.

Pooja Nimmala

testing telangana adda website

సంబంధిత వీడియోలు