14 పంటలకు మద్దతు ధర పెంపు
2nd Jun, 2025 03:49 PM
కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
వానాకాలం సీజన్ లో 14 పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి అశ్వనీ వైష్ణవ్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. వరి సాధారణ, ఏ గ్రేడ్ క్వింటాల్ కు కనీస మద్దతు ధరను రూ.69 పెంచారు. అత్యధికంగా గడ్డినువ్వులకు క్వింటాల్ కు రూ.820, రాగులు రూ.596, పత్తికి రూ.589, కుసుమలకు రూ.579, వేరుశనగలకు రూ.480, కందులు రూ.450, పొద్దుతిరుగుడు రూ.441, సోయాబీన్ రూ.436, మినుములు రూ.400, జొన్నలకు రూ.328, మొక్కజొన్న రూ.175, సజ్జలకు రూ.150 చొప్పున పెంచారు. పంటలకు ఎంఎస్‌పీ చెల్లించేందుకు రూ.2.7 లక్షల కోట్లు కేటాయించామని మంత్రి తెలిపారు. రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కోట్లు చెల్లిస్తున్నామని చెప్పారు. ఏపీలోని బద్వేలు - నెల్లూరు హైవేను ఫోర్ లేన్ గా అభివృద్ధి చేయడానికి రూ.3,653 కోట్లు కేటాయించారు.