3 వేలకు చేరువైన కరోనా కేసులు
2nd Jun, 2025 03:37 PM
దేశంలో కొనసాగుతున్న కోవిడ్ వ్యాప్తి
దేశంలో కరోనా కేసుల తీవ్రత, వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. శనివారం నాటికి 2,710 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కేరళ, మహారాష్ట్ర, దేశ రాజధాని ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా 424 యాక్టివ్ కేసులు ఉండగా, దేశ రాజధాని ఢిల్లీ 294 కేసులతో రెండో స్థానంలో ఉంది. గుజరాత్‌లో 223, తమిళనాడులో 148, కర్నాటకలో 148, పశ్చిమబెంగాల్‌లో 116, రాజస్థాన్‌లో 51, ఉత్తరప్రదేశ్‌లో 42, పుదుచ్చేరిలో 25, హర్యాణాలో 20, ఆంధ్రప్రదేశ్‌లో 16, మధ్యప్రదేశ్‌లో 10, గోవాలో ఏడు, ఒడిశా, పంజాబ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో నాలుగు చొప్పున యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్ లో మూడు చొప్పున, మిజోరాం, అసోంలలో ఇద్దరు చొప్పున వైరస్ బారిన పడ్డారు.