BRS Rajathotsavam: నేడే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ

2nd Jun, 2025 01:31 PM

నేడే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ

బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభను హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించనుంది. సభలో కేసీఆర్‌ కాంగ్రెస్‌ మరియు బీజేపీలపై విమర్శలు చేస్తారని సమాచారం.

  • హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో సర్వం సిద్ధం

  • అన్ని జిల్లాల నుంచి జన సమీకరణకు ప్రణాళికలు

  • 154 ఎకరాల్లో సభా ప్రాంగణం

  • మాట్లాడేది కేసీఆర్‌ ఒక్కరే.. కాంగ్రెస్‌, బీజేపీలపై విమర్శలు?

హైదరాబాద్‌/వరంగల్‌, ఏప్రిల్‌ 26, (ఆంధ్రజ్యోతి): ఓరుగల్లు వేదికగా రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ సర్వం సిద్ధం చేసింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద ఆదివారం సాయంత్రం 4.30గంటలకు జరిగే భారీ బహిరంగ సభ కోసం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జన సమీకరణపై దృష్టి పెట్టిన బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం... దానికి తగ్గట్లు ప్రణాళికలు రూపొందించుకుంది. ఉమ్మడి వరంగల్‌తోపాటు సమీపంలోని ఉమ్మడి కరీంనగర్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల నుంచి ప్రధానంగా జనసమీకరణ చేపడుతోంది. ఆయా జిల్లాల్లోని ఒక్కో నియోజకవర్గం నుంచి 30-50వేల మందిని తరలించేందుకు, మిగతా జిల్లాల నుంచి వీలైనంత మందిని తీసుకొచ్చేందుకు వీలుగా ఇప్పటికే పార్టీ నాయకత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. భారీ బహిరంగ సభలో మాట్లాడేది ఒకే ఒక్కరు. అది బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆరే. ఆయన ప్రధాన గురి కూడా మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపైనే ఉంటుందని సమాచారం. రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదని, రైతు భరోసా ఇంకా ఇవ్వలేదన్న అంశాల నుంచి పలు హామీల అమలుపై అధికార కాంగ్రె్‌సను ఆయన నిలదీయనున్నట్లు తెలిసింది. అదే సమయంలో అటు బీజేపీపైనా రాజకీయ విమర్శలుంటాయని సమాచారం.

Pooja Nimmala

testing telangana adda website

సంబంధిత వీడియోలు