Biryani Disadvantages | తరచూ బిర్యానీని తింటున్నారా..? అయితే రోగాలకు స్వాగతం పలుకుతున్నట్లే..!
23rd May, 2025 11:09 AM
Biryani Disadvantages | ప్రస్తుతం దేశంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా సరే ప్రజలు నాన్ వెజ్ రుచులను విడిచిపెట్టకుండా తింటున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ లేదా యూట్యూబ్‌లో షార్ట్స్‌ను చూస్తున్న నెటిజన్లు వాటిల్లో వచ్చే ఫుడ్ వీడియోలను చూసి మైమరిచిపోతున్నారు. ఆ ఫుడ్స్‌ను తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా వరకు రెస్టారెంట్లలో అనేక నాన్ వెజ్ వెరైటీలతోపాటు బిర్యానీ వెరైటీలు కూడా లభిస్తున్నాయి. అయితే ఘుమ ఘుమలాడే బిర్యానీని తినడం వరకు బాగానే ఉంటుంది. కానీ దాని రుచికి దాసోహం అయిపోయి బానిసగా మారితేనే కష్టం. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి జిహ్వా చాపల్యం తీర్చుకునేందుకు బిర్యానీని టేస్ట్ చేయవచ్చు. కానీ తరచూ బిర్యానీని తింటే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బిర్యానీని తరచూ తినడం మంచిది కాదని వారు సూచిస్తున్నారు.
pfa