Tirumala:

2nd Jun, 2025 04:49 PM

భక్తుడి ముసుగులో నినాదాలు చేసిన వైసీపీ నేత అచ్చారావు

Tirupati: తిరుమల.. క్యూలైన్లలో నినాదాల ఘటన (Tirumala slogan controversy)లో కీలక పరిణామం (Key Twist) చోటు చేసుకుంది. భక్తుడి ముసుగులో నినాదాలు చేసిన వైసీపీ నేత అచ్చారావు (YCP leader Achha Rao)పై ఇప్పటికే పోలీసులు బైండోవర్ కేసు (Police Case) నమోదు చేశారు. క్యూలైన్లలో నినాదాలు చేస్తున్న సమయంలో వీడియోలు చిత్రీకరించింది.. టీటీడీ ఆరోగ్య శాఖ ఉద్యోగి విజయరావుగా గుర్తించారు. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు (Vigilance officers) విజయరావును అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. భక్తుడి ముసుగులో వైసీపీ నేత నిరసనను చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం వెనుక ఎవరు ఉన్నారన్న దానిపై భద్రతా సిబ్బంది విచారిస్తున్నారు. ఈ కుట్ర వెనుక ఎవరి హస్తం వుంది.. అసలు సూత్రధారులు ఎవరనే దానిపై కూడా అధికారులు విచారిస్తున్నారు.

వైసీపీ దుష్ప్రచారం..

కాగా తిరుమల క్యూలైన్లలో నినాదాల ఘటనపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్యూ లైన్లో వైసీపీ నాయకుడు అచ్చారావు ఉద్దేశపూర్వకంగా భక్తులను రెచ్చగొట్టి నినాదాలు చేశారని ఆయన ఆరోపించారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయకూడదని నియమ నిబంధనలు ఉన్నాయని, ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమలలో అన్యాయాలు జరుగుతున్నాయంటూ ప్రజల్లో ఒక భావన తీసుకువెళ్లేలా వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. కాకినాడ నుంచి వచ్చిన అచ్చారావు టీటీడీ పవిత్రతకు భంగం కలిగించారని, టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.

అలాంటి వారిపై కఠిన చర్యలు..

రాబోయే బోర్డు సమావేశంలో చట్ట సవరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. స్వామి వారి ఉప్పు తింటూ క్యూ లైన్ ఘటనను వీడియో తీశారని, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చెప్పిన 2 వేల మంది నిఘా నేత్రాలలో కొన్ని నేత్రాలు ఇప్పటికీ పని చేస్తున్నాయని అన్నారు. స్వామి వారి దగ్గర పని చేస్తూ.. టీటీడీకి వ్యతిరేకంగా పని చేసే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అలాంటి వారిని ఉద్యోగాల నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకుంటామని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.

Pooja Nimmala

testing telangana adda website

సంబంధిత వీడియోలు