సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి ఉప‌శ‌మ‌నం పొందాలంటే..

27th May, 2025 06:09 PM

ప్ర‌తి ఏడాది లాగా కాకుండా ఈసారి కాస్త ముందుగానే వ‌ర్షాకాలం సీజ‌న్ వ‌చ్చింది.

Papaya Leaves | ప్ర‌తి ఏడాది లాగా కాకుండా ఈసారి కాస్త ముందుగానే వ‌ర్షాకాలం సీజ‌న్ వ‌చ్చింది. ప్ర‌తి ఏడాది జూన్ 3వ వారంలో ఈ సీజ‌న్ మొద‌ల‌వుతుంది. కానీ మే నెల చివ‌రి వారంలోనే అనూహ్యంగా నైరుతి రుతు ప‌వ‌నాలు ప్ర‌వేశించాయి. దీంతో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది. వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌నం ల‌భించింది. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ సీజ‌న్ మారిన‌ప్పుడు ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం అంద‌రినీ ఇబ్బందుల‌కు గురి చేస్తుంటాయి. ఈ సీజ‌న్‌లో దోమ‌లు విజృంభిస్తాయి. దీంతో డెంగీ, మ‌లేరియా వంటి విష జ్వ‌రాలు కూడా ప్ర‌బ‌లుతుంటాయి. అయితే ఈ సీజ‌న్ లో మ‌న ఆరోగ్యం సుర‌క్షితంగా ఉండాలంటే ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచుకోవాల్సి ఉంటుంది. దీంతో రోగాలు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. ఇమ్యూనిటీ ప‌వర్ పెర‌గాలంటే అందుకు బొప్పాయి ఆకులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

సంబంధిత వీడియోలు