Heinrich Klaasen: 33 ఏళ్లకే రిటైర్మెంట్

2nd Jun, 2025 04:30 PM

క్రికెట్‌కు దక్షిణాఫ్రికా చిచ్చరపిడుగు బై బై.. 33 ఏళ్లకే రిటైర్మెంట్

దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ క్రికెట్ ప్రపంచానికి షాకిచ్చాడు. 33 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. మొత్తం మూడు ఫార్మాట్లకు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించి అందరికీ షాకిచ్చాడు.అంతర్జాతీ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. క్లాసెన్ ఐపీఎల్‌ (IPL 2025)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు. తాజా సీజన్‌లో కూడా సత్తా చాటాడు.

హెన్రిచ్ క్లాసెన్ ప్రస్తుత వయసు 33 సంవత్సరాల 303 రోజులు. అతడి వయసు, ఫామ్ దృష్ట్యా చూసుకుంటే ఇది రిటైర్మెంట్ ప్రకటించడానికి సరైన సందర్భం కాదు. అయినా క్లాసెన్ మాత్రం అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. దక్షిణాఫ్రికా తరఫున ఆడడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా పేర్కొన్నాడు. ఇన్నాళ్లూ తనకు మద్దతుగా నిలిచిన సహచరులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశాడు.క్లాసెన్ ఇప్పటివరకు దక్షిణాఫ్రికా తరఫున 60 వన్డేలు ఆడి 2141 పరుగులు చేశాడు. అలాగే 58 టీ-20లు ఆడి 1000 పరుగులు చేశాడు. అలాగే 4 టెస్ట్‌లు ఆడి 104 పరుగులు చేశాడు. అయితే క్లాసెన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కంటే ఐపీఎల్‌లోనే మెరుగైన ప్రదర్శన చేశాడు. ఇప్పటివరకు మొత్తం 48 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 1480 పరుగులు చేశాడు. కాగా, ఈ రోజే ఆస్ట్రేలియా డాషింగ్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్ కూడా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Pooja Nimmala

testing telangana adda website

సంబంధిత వీడియోలు