KCR: కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవ్వడంపై కేసీఆర్ కీలక నిర్ణయం

2nd Jun, 2025 04:33 PM

కాళేశ్వరం కమిషన్ విచారణకు (Kaleshwaram Commission Enquiry) మాజీ సీఎం

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణకు (Kaleshwaram Commission Enquiry) మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 5వ తేదీన విచారణకు రావాలని కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ విచారణకు మరింత సమయం కావాలని కమిషన్ చైర్మన్‌ను కేసీఆర్ కోరినట్లు సమాచారం. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకావడంపై ఆయన సుదీర్ఘ ఆలోచనలు చేస్తున్నారు.ఇవాళ(జూన్2) తెలంగాణ భవన్‌లో మాజీమంత్రి హరీష్‌రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవాలని భావించారు. కానీ అనివార్య కారణాలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 9వ తేదీన కమిషన్ ముందు విచారణకు మాజీ మంత్రి హరీష్‌రావు హాజరుకానున్నారు. అయితే హరీష్‌రావు హాజరు తర్వాత పరిణామాలను బట్టి ఈనెల 11వ తేదీన విచారణకు వెళ్లాలా వద్దా అనే విషయంపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.

Pooja Nimmala

testing telangana adda website

సంబంధిత వీడియోలు