Old City Metro | 50 శాతమూ పూర్తికాలే..

27th May, 2025 10:31 AM

ఓల్డ్‌ సిటీ మెట్రో భూసేకరణకు ఎదురవుతున్న సవాళ్లు

అట్టహాసంగా ప్రారంభించిన ఓల్డ్‌ సిటీ మెట్రో భూసేకరణ అపసోపాలు పడుతోంది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు ప్రక్రియను ముందుకు సాగనివ్వడం లేదు. నాలుగు నెలల కిందట రెవెన్యూ, మెట్రో కలిసి భూసేకరణకు కసరత్తు ప్రారంభించినా... ఇప్పటి వరకు 50 శాతం కూడా పూర్తి కాలేదు.


  • ఓల్డ్‌ సిటీ మెట్రో భూసేకరణకు ఎదురవుతున్న సవాళ్లు
  • ముందుకు సాగని ప్రాజెక్టు .. భూసేకరణలో తీవ్ర జాప్యం

సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ) : అట్టహాసంగా ప్రారంభించిన ఓల్డ్‌ సిటీ మెట్రో భూసేకరణ అపసోపాలు పడుతోంది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు ప్రక్రియను ముందుకు సాగనివ్వడం లేదు. నాలుగు నెలల కిందట రెవెన్యూ, మెట్రో కలిసి భూసేకరణకు కసరత్తు ప్రారంభించినా… ఇప్పటి వరకు 50 శాతం కూడా పూర్తి కాలేదు. మతపరమైన, చారిత్రక కట్టడాల ప్రాంతాల్లో ఎదురవుతున్న ఇబ్బందులతో వేగంగా జరగాల్సిన భూసేకరణకు అడ్డంకులు వస్తున్నాయి. దీంతో భూములు సేకరిస్తే తప్ప.. ప్రాజెక్టును నిర్మించే వీలు లేకుండా పోయింది. ఆస్తులు సేకరించిన ప్రాంతంలో కూల్చివేతలు మొదలుపెట్టినా.. న్యాయపరమైన చిక్కులు మెట్రోను వెనక్కి లాగుతూనే ఉన్నాయి.

సంబంధిత వీడియోలు