Stock Market | మార్కెట్లకు బాండ్‌ దెబ్బ.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ సూచీలు

23rd May, 2025 11:33 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. పెరిగిన అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ ఒకవైపు.. ఎగబాకుతున్న ఆ దేశ అప్పుల భారం మరోవైపు.. భారతీయ సూచీలను కుదిపేశాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్‌ 644.64 పాయింట్లు లేదా 0.79 శాతం పడిపోయి 80,951.99 వద్ద నిలిచింది.


  • సెన్సెక్స్‌ 645, నిఫ్టీ 204 పాయింట్లు డౌన్‌
  • తీవ్ర అమ్మకాల ఒత్తిడిలో ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్లు


Stock Market | ముంబై, మే 22 : దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. పెరిగిన అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ ఒకవైపు.. ఎగబాకుతున్న ఆ దేశ అప్పుల భారం మరోవైపు.. భారతీయ సూచీలను కుదిపేశాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్‌ 644.64 పాయింట్లు లేదా 0.79 శాతం పడిపోయి 80,951.99 వద్ద నిలిచింది. ఒకానొక దశలోనైతే 1,106.71 పాయింట్లు క్షీణించడం గమనార్హం. ఇక నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ కూడా 203.75 పాయింట్లు లేదా 0.82 శాతం కోల్పోయి 24,609.70 వద్ద స్థిరపడింది.


files

సంబంధిత వీడియోలు