Hydraa | హైదరాబాద్ పుప్పాలగూడలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.
22nd May, 2025 06:34 PM
హైదరాబాద్: కష్టంలో ఉన్న తల్లిలాంటి పార్టీని నమ్ముకొని ఉండే వారే నిజమైన కార్యకర్తలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అవకాశవాదులే సిగ్గులేకుండా పార్టీ మారుతారని విమర్శించారు. పార్టీ నుంచి పారిపోయిన వారి పేర్లు తీసుకొని వారిని పెద్దోళ్లను చేయొద్దన్నారు. పార్టీ కోసం కొట్లాడేవారికే అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో నిర్మల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తలే రేవంత్ పాలనపై మండిపడుతున్నారని, ఇదేం పాలన అంటూ ఆ పార్టీ నాయకులే నిలదీస్తున్నారన్నారు.